తెలంగాణ కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై సొంత పార్టీకి చెందిన మాజీ ఎంపీ వి. హనుమంత రావు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రేవంత్రెడ్డి అనుచరులు తనను బెదిరించినట్టు వీహెచ్ అంబర్పేట పోలీస్ స్టేషన్లోనూ.. హైదరాబాద్ నగర సీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు.