2014 జూన్-2న తెలంగాణ ఆవిర్భవించింది. నేటికి ప్రత్యేక రాష్ట్రం ఏడేళ్లు పూర్తి చేసుకుంది. మరి ఈ ఏడేళ్లలో తెలంగాణ ప్రజలు ఆశించిన మార్పులు కనిపించాయా..? నిధులు, నీళ్లు, నియామకాల్లో స్థానికులకు న్యాయం జరిగిందా..? దీనిపై ఇప్పుడు సుదీర్ఘ చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ వల్ల అత్యధిక లాభం పొందింది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమేనంటూ దెప్పిపొడుస్తున్నారు విపక్ష నేతలు. ఏడేళ్లయినా ప్రజల సమస్యలు అలాగే ఉన్నాయంటున్నారు. దీనిలో ఏది నిజం, ఎంతవరకు నిజం అనేది ప్రజలకే బాగా తెలుసు.