తెలుగుదేశం పార్టీలో శాసన సభ్యుడిగా వ్యవహరిస్తున్న కే.చంద్రశేఖర్ రావు.. 2001లో ఆ పార్టీని వీడి బయటకు వచ్చారు. అప్పుడు తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, తదితర మేధావులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్నో ఊహించని పరిణామాలు జరిగాయి.