కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు బంద్ అయిన విషయం తెలిసిందే. అలాగే కేంద్రం పది, 12వ తరగతుల పరీక్షలని రద్దు చేసింది. అటు పలు రాష్ట్రాలు సైతం పది, ఇంటర్ పరీక్షలని రద్దు చేసింది. కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిల్లోనూ పరీక్షలని పెట్టాలని చూస్తుంది. ప్రస్తుతం టెన్త్, ఇంటర్ పరీక్షలని వాయిదా వేసిన ప్రభుత్వం, వాటిని ఎలాగైనా నిర్వహించాలని చూస్తుంది. కానీ టీడీపీ నేత నారా లోకేష్ మాత్రం పరీక్షలు రద్దు చేసి, విద్యార్ధులని పాస్ చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.