జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఏ స్థాయిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఏ సీఎం అమలు చేయని విధంగా జగన్ సంక్షేమ పథకాలకు పెద్ద పీఠ వేశారు. ఈ రెండేళ్ల కాలంలో తాను మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేసే దిశగానే పాలన కొనసాగించారు. ఇప్పటివరకు చాలా పథకాలు ప్రవేశపెట్టారు. అభివృద్ధి విస్మరించిన, సంక్షేమాన్ని మాత్రం వదలకుండా ముందుకు నడిపించారు. ఏపీలో ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబాలకు సంక్షేమం అందేలా చేశారు.