ఏపీలో సీఎం జగన్కు తిరుగులేని బలం ఉందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ఆయనకు చంద్రబాబు పోటీ ఇవ్వలేకపోతున్నారు. గత ఎన్నికల్లోనే జగన్ ఓ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏపీ చరిత్రలోనే ఊహించని విధంగా అతి పెద్ద విజయాన్ని అందుకుని అధికారంలోకి వచ్చారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఏపీలో జగన్ బలం తగ్గలేదు. ఈ రెండేళ్ల కాలంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. దీంతో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు.