రాజకీయాల్లో వలసలు సహజమే. అధికారమే లక్ష్యంగా ఏ నాయకుడైన రాజకీయం చేస్తుంటారు. కానీ తాము ఉన్న పార్టీ అధికారంలోకి రాకపోతే, అధికారంలోకి వచ్చిన పార్టీలోకి జంప్ అయిపోతుంటారు. గతంలో ఏపీలో అధికారంలో టీడీపీలోకి వైసీపీ నేతలు వరుస పెట్టి వెళ్ళిపోయారు. చాలామంది నాయకులు సైకిల్ ఎక్కారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పసుపు జెండా కప్పుకున్నారు.