మర్రి రాజశేఖర్....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. కమ్మ సామాజికవర్గానికి చెందిన మర్రి, చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున టిక్కెట్ రాకపోయిన సరే చిలకలూరిపేట నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్సార్ పిలుపుతో మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్లారు.