ఇవాళ.. వైయస్ఆర్ జగనన్న కాలనీల గృహనిర్మాణం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం జగన్ వర్చ్యువల్‌గా పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రూ.28,084 కోట్లతో మొదటిదశలో 15.60 లక్షల పక్కాగృహాల నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇవాళ ప్రారంభించే పనులు.. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.