ఏపీలో తెలుగుదేశం పార్టీ ఏ జిల్లాలో బలంగా ఉందంటే.. చెప్పడానికి ఏ జిల్లాలోనూ లేదనే చెప్పొచ్చు. 13 జిల్లాలోనూ వైసీపీ హవానే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీ బలోపేతం కావడం లేదు. ఈ రెండేళ్లలో వైసీపీ బలం తగ్గలేదు గానీ, టీడీపీ మాత్రం ఇంకా వీక్ అవుతూ ఉంది. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా తెలుగుదేశం ఎక్కడ కూడా స్ట్రాంగ్ అవ్వలేదు. ఆఖరికి పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు, పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించిన సరే ఉపయోగం లేకుండా పోయింది.