వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, అన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే గొంతు వినిపించాలంటూ ఏపీ సీఎం జగన్ వారికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేరుగా కేంద్రంపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా కేంద్రమే వ్యాక్సినేషన్ల బాధ్యత స్వీకరించాలని, లేదా ఆర్థిక సాయం చేయాలన కరాఖండిగా చెప్పారు. ఈ దశలో ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ కలకలం రేపుతోంది. అయితే జగన్ తో కలిసొచ్చేదెవరు, ఆయన్ను విభేదించేది ఎవరు అనే విషయం తేలాల్సి ఉంది.