ఆయన ఓ ప్రొఫెసర్.. ఆమె ఓ విద్యార్థిని.. అందులోనూ వారిద్దరూ రోగులకు ప్రాణం పోసే పవిత్రమైన వైద్యవిద్యలో ఉన్నారు. కానీ ఆ ప్రొఫెసర్ కన్ను 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై పడింది. అంతే వేధించడం ప్రారంభించాడు. వెకిలి చేష్టలు.. ఫోన్ సంభాషణలతో విసుగెత్తిస్తున్నాడు.