గత ఎన్నికల్లో చాలామంది టీడీపీ సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకున్న విషయం తెలిసిందే. అయితే కొందరు నాయకులు మాత్రం తమకు, తమ వారసులకు టిక్కెట్ కావాలని గట్టిగానే ప్రయత్నించారు. కానీ చంద్రబాబు మాత్రం ఒక కుటుంబానికి, ఒకటే టిక్కెట్ అని రూల్ పెట్టడంతో, పలువురు సీనియర్ నేతలు, తమ వారసులకు టిక్కెట్ ఇప్పించలేకపోయారు.