గత ఎన్నికల్లో జగన్ వేవ్‌ని తట్టుకుని టీడీపీ తరుపున ముగ్గురు ఎంపీలు గెలిచిన విషయం తెలిసిందే. శ్రీకాకుళంలో రామ్మోహన్, విజయవాడలో కేశినేని నాని, గుంటూరులో గల్లా జయదేవ్ విజయం సాధించారు. అయితే వీరు విజయం సాధించిన పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయినా సరే కేశినేని, గల్లా, రామ్మోహన్‌లు గెలవడానికి కారణం క్రాస్ ఓటింగ్.