ఏపీలో కేబినెట్లో మార్పులు చేయడానికి ముహూర్తం దగ్గర పడుతుంది. మరో ఆరు నెలల్లో సీఎం జగన్, తన కేబినెట్లో కీలక మార్పులు చేయనున్నారు. పాత మంత్రుల్లో కొందరిని పక్కనబెట్టేసి, కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. అయితే జగన్, మొదట కేబినెట్ ఏర్పాటు చేసినప్పుడే, రెండున్నర ఏళ్లలో మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పేశారు.