రాజధాని అమరావతి ప్రాంతం ఉన్న గుంటూరు పార్లమెంట్ స్థానంలో టీడీపీ వీక్‌గా ఉందా? అంటే అబ్బో బాగా వీక్‌గా ఉందని చెప్పొచ్చు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాజధాని ఏర్పాటు చేయడంతో గుంటూరులో టీడీపీకి తిరుగులేదేని అంతా అనుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో రాజధాని మంత్రం పనిచేయలేదు. ప్రజలు పెద్ద ఎత్తున వైసీపీని గెలిపించారు.