ఏపీలో జగన్ ఇమేజ్ వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంత ప్లస్ అవుతుందో, టీడీపీ నేతలకు అంత మైనస్ అవుతుంది. గత ఎన్నికల్లోనే బడా బడా టీడీపీ నేతలు జగన్ ఇమేజ్ ముందు నిలవలేకపోయారు. జగన్ వేవ్‌లో ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికలై రెండేళ్ళు అయినా సరే, జగన్ ఇమేజ్ బలంగా ఉంది. అందుకే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకోలేకపోయారు.