ఏపీలో మూడు రాజధానుల కాన్సెప్ట్ మళ్ళీ తెరపైకి వచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది చివరిన అంటే, 2019 డిసెంబర్లో మూడు రాజధానుల కాన్సెప్ట్ ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేసింది. రాజధానిగా అమరావతి పనికి రాదని, అలాగే రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం జగన్, ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచేసి, కర్నూలుని న్యాయ రాజధానిగా, విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా చేస్తామని చెప్పారు.