కరోనా సోకనివారికంటే, ఒకసారి వైరస్ తో బాధపడి కోలుకున్నవారే అదృష్టవంతులని బ్రిటన్ తాజా పరిశోధన చెబుతోంది. కరోనా ఒకసారి వచ్చి తగ్గిపోతే.. వారి జోలికి ఆ వైరస్ రావడానికి ఏడాదికి పైగా టైమ్ పడుతుందని, అప్పటి వరకు వారిలో ఉన్న యాంటీబాడీలు రక్షణగా ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.