కరోనా సమయంలో ఈ స్టాక్డేల్ ఆలోచనా విధానం అందరికీ అవసరం. కరోనా విషయంలో అవసరం. ఇప్పుడు తగ్గుతుంది, అప్పుడు తగ్గుతుందనే ఆశలు పెట్టుకునే కన్నా ఖచ్చితంగా మనం ఈ పాండమిక్ ను దాటుకుని గతంలో లాగానే చక్కగా, సంతోషంగా తిరగగలుగుతామనే నమ్మకాన్ని ఉంచుకుని ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని, ఓపికగా ఎదురు చూడండి. కరోనాకే బోర్ కొట్టి - అది మనల్ని వదలి వెళ్ళే రోజు ఎంతో దూరం ఉండబోదు.