దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెరగడం అందరినీ ఆందోళనలో పడేస్తోంది. అదే సమయంలో దాని చికిత్సకు అవసరమైన మందులు కూడా బ్లాక్ మార్కెట్ కి తరలిపోతున్నాయి. ఔషధాలు అందుబాటులో లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ నివారణకు సత్వరం వైద్యులను కన్సల్ట్ అవడమే ఏకైక మార్గమని చెబుతున్నారు నిపుణులు. ఆలస్యం చేసేకొద్దీ బ్లాక్ ఫంగస్ ప్రమాదకరంగా మారుతుందని, లక్షణాలు కనపడిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.