టీఆర్ఎస్ పార్టీ పుట్టిన సరిగ్గా 20 ఏళ్లు. కేసీఆర్ చేతుల మీదుగా ప్రాణం పోసుకున్న టీఆర్ఎస్లో కేసీఆరే సుప్రీం. ఆ విషయంలో డౌట్ లేదు. కానీ.. కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో కొందరు పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కనుమరుగైపోయారు. ఆలె నరేంద్ర, విజయశాంతి.. ఇప్పుడు ఈటల రాజేందర్. ఈటలకు టీఆర్ఎస్తో 18 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది.