విజయవాడ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే నడుస్తుంటాయి. ముఖ్యంగా బెజవాడ తెలుగుదేశం పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు ఎప్పుడు హైలైట్ అవుతుంటాయి. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ నేతల మధ్య రచ్చ జరిగింది. ఎంపీ కేశినేని నాని, సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. బుద్దా వెంకన్న, బోండా ఉమాలు లక్ష్యంగా నాని విరుచుకుపడ్డారు. అటు బోండా, బుద్దాలు సైతం నానిపై ఫైర్ అయ్యారు.