కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట. వైసీపీ ఆవిర్భావించిన దగ్గర నుంచి ఈ జిల్లాలో టీడీపీకి పెద్ద ఛాన్స్ లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా సరే కర్నూలులో మాత్రం సత్తా చాటలేకపోయింది. జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 11 గెలుచుకుంటే, టీడీపీ 3 గెలుచుకుంది. రెండు ఎంపీ సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీకి సున్నా సీట్లు వచ్చాయి.