గత ఎన్నికల్లో జగన్ గాలిని తట్టుకుని టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక, ఆ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ వైపు లాగేసుకున్నారు. అలాగే మరి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు అపోజిట్‌గా బలమైన వైసీపీ ఇన్‌చార్జ్‌లని పెట్టి దెబ్బకొట్టారు.