మంత్రివర్గంలో మార్పులకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పదవులు కాపాడుకోవడానికి మంత్రులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం చాలావరకు పాతవారిని పక్కనబెట్టి, కొత్తవారికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. మరో ఆరు నెలల్లో జగన్ కేబినెట్లో మార్పులు చేయనున్నారు. ఈ క్రమంలోనే రాయలసీమలో ఎవరు పదవి ఉంటుందో? ఎవరి పదవి ఊడుతుందో?అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.