సాధారణంగా పెద్దల సభగా ఉన్న శాసనమండలి ఎప్పుడు హైలైట్ అవ్వదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మండలి బాగా హైలైట్ అయింది. ఎందుకంటే అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి బిల్లు అయిన ఆమోదం పొందితే, మండలిలో మాత్రం బ్రేక్ పడేది. అసెంబ్లీలో వైసీపీకి భారీగా మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మండలిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండేది. అందుకే అక్కడ వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలేవి. ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లు విషయంలో. అందుకే జగన్ సైతం మండలి రద్దుకు మొగ్గు చూపి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ ఆ ప్రక్రియ ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు.