డొక్కా మాణిక్యవరప్రసాద్...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఇక అందరు కాంగ్రెస్ నాయకులు మాదిరిగానే డొక్కా రాజకీయ భవిష్యత్ రాష్ట్ర విభజన తర్వాత అయోమయంలో పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి మరింత దిగజారిపోవడంతో డొక్కా పార్టీ మారాల్సి వచ్చింది. 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం, పైగా తన రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు టీడీపీలోనే ఉండటంతో, డొక్కా టీడీపీలోకి వచ్చారు.