కేసీఆర్ ఒకసారి పగబడితే ఎలా ఉంటుందో బాగా తెలిసిన ఈటల.. తనకు ఓ జాతీయ పార్టీ అండ తప్పదని గుర్తించారు. అందుకు అనుగుణంగానే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన ఇటీవల బీజేపీలో చేరే నిర్ణయం ప్రకటించిన ప్రెస్ మీట్లో సీపీఐ మీద కొన్ని కామెంట్లు చేయడం వివాదాస్పదం అయ్యింది.