ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పలేదనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. గతంలో ప్రతి ఏడాదీ యోగీ డైనమిక్ అని, ఎనర్జిటిక్ అని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడని పొగడ్తల్లో ముంచెత్తే మోదీ.. ఈ ఏడాది మాత్రం అసలు పుట్టినరోజు విషెస్ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారు. యోగి విషయంలో మోదీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని, దానికి నిదర్శనమే ఇదని, ఉత్తర ప్రదేశ్ పాలన, పార్టీ పరిస్థితిపై ప్రధాని సహా ఇతర బీజేపీ నేతలంతా అసంతృప్తితో ఉన్నారనే కథనాలు వెలువడ్డాయి. అయితే వాటన్నిటినీ బీజేపీ నేతలు ఖండించారు.