ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. మొత్తం 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం తాడిపత్రిలోనే గెలిచింది. అటు అన్నీ కార్పొరేషన్ల్లో టీడీపీ ఘోరంగా ఓడింది. అయితే విశాఖపట్నంలో కొంతమేర కార్పొరేటర్లని గెలుచుకుని, పరువు నిలుపుకుంది. విశాఖ కార్పొరేషన్లో మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. అందులో వైసీపీ 58 గెలుచుకుని కార్పొరేషన్ సొంతం చేసుకుంది.