ఏపీలో చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయినట్లేనా? 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన చంద్రబాబుని ప్రజలు మరిచిపోయారా? అంటే వైసీపీ నేతల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ తీవ్ర కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు సైతం, తన ఇమేజ్‌ని మళ్ళీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండుసార్లు ఉమ్మడి ఏపీకి, ఒకసారి ఏపీకి సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్‌ని తట్టుకుని నిలబడేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు.