ఏపీలో ఆనందయ్య మందుపై ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా నివారణ కోసం ఆనందయ్య తయారు చేసిన మందుతో వైసీపీ నేతలు వ్యాపారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారని, ఆయనే మందుని వ్యాపారంగా మార్చేశారని మండిపడుతున్నారు.