తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ట్విట్టర్ లో 'ఇడియట్' అని సంబోధిస్తూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీకా విషయంలో కేటీఆర్ కేంద్రంపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ శర్మ కాస్త గట్టిగా రియాక్ట్ అయ్యారు. 'ఇడియట్' అంటూ ట్విట్టర్ లో నోరు పారేసుకున్నారు. 'లెట్స్ టాక్ వ్యాక్సినేషన్' అనే హ్యాష్ ట్యాగ్ తో కేటీఆర్ మొదలు పెట్టిన ట్విట్టర్ చాట్ లో ఈ వివాదం చోటు చేసుకుంది.