"ఈటల రాజేందర్ కు బీజేపీ ఎలాంటి హామీ ఇవ్వలేదు, హుజూరాబాద్ లో ఎవరు పోటీ చేయాలనేది పార్టీయే నిర్ణయిస్తుంది.." బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తాజాగా చేసిన వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలు ఇటు బీజేపీలోనూ, అటు ఈటల వర్గంలోనూ కాక రేపాయి. ఇన్నాళ్లూ.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మరో నేత మోత్కుపల్లి నర్సింహులు.. ఈటలకు స్వపక్షంలో విపక్షంలా ఉంటారని అనుకున్నా.. ఇప్పుడు డీకే అరుణ కూడా దాదాపుగా అలాంటి వ్యాఖ్యలే చేసి కలకలం రేపారు. ఈటల అధికారికంగా ఇంకా పార్టీలో చేరకముందే తలోరకంగా మాట్లాడటంతో ఆయన వర్గంలో కలవరం మొదలైంది.