సెల్‌ఫోన్ జప్తు సమయంలో సాక్షుల సమక్షంలో చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు. దీన్ని బట్టి వాట్సాప్ సందేశాలు వెళ్లాయని ఆయన చెబుతున్న సిమ్ కార్డు నంబర్‌తో ఉన్న సెల్‌ఫోన్ సీఐడీ పోలీసుల వద్ద లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఒప్పుకున్నట్టేనని సీఐడీ అంటోంది. మరి సీఐడీ చెబుతున్నదీ లాజిక్కే.. ఈ దెబ్బతో రఘురామ చిక్కుల్లో పడినట్టేనా..?