గత ఎన్నికల్లో జనసేన వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీకి మద్ధతు ఇవ్వడం వల్ల బాగా బెన్ఫిట్ జరిగింది. టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో జనసేన, టీడీపీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి బాగా లాభం జరిగింది.