ఏపీలో బీజేపీ నేతలకంటూ ఓ స్పష్టమైన వైఖరి ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఏపీలో బీజేపీది ప్రతిపక్ష పాత్ర. ఆ పార్టీకి ఒక్కశాతం ఓట్లు రాకపోయినా సరే, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏపీలో కాస్త ఉనికి ఉందని చెప్పొచ్చు. అయితే ఏపీలో ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీజేపీ నేతలు ఒక లైన్లో వెళుతున్నట్లు కనిపించరు. ఎందుకంటే ఏపీలో కొందరు బీజేపీ నేతలు జగన్కు అనుకూలంగా ఉన్నారని విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో మరికొందరు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని కూడా విమర్శలు వస్తున్నాయి.