చలన చిత్రరంగంలోకి రావాలని చాలా మంది ఉబలాటపడుతుంటారు. వారిలో చాలా మందికి అవకాశాలు దక్కవు, కొందరికి దక్కినా నిలబెట్టుకోలేక పోతుంటారు. అంతేకాకుండా సినిమా రంగంలో నిలదొక్కుకోవడం, మంచి గుర్తింపు తెచ్చుకోవడం సులువు కాదని, ఎంతో కృషి చేస్తే కాని ఇక్కడ గుర్తింపు దక్కదని ఎందరో అగ్ర నటులు అభిప్రాయ పడుతుంటారు. అంతేకాకుండా ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ కన్నా టాలెంట్‌కే ప్రాధాన్యం ఎక్కువ. అందులోనూ ఓ కమెడియన్‌గా రాణించాలంటే మరింత కష్టం. హీరో, విలన్, హీరోయిన్ల కన్నా కమెడియన్‌కే ఎక్కువ కష్టం ఉంటుంది.