తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో హిందూపురం ఒకటి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలం బాగానే ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ పార్లమెంట్ స్థానంలో టీడీపీ మంచి విజయాలే సాధించింది. కానీ గత ఎన్నికల్లో మాత్రం జగన్ దెబ్బకు సైకిల్ చిత్తు అయిపోయింది. పార్లమెంట్ స్థానంతో పాటు, 6 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. కేవలం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ మరోసారి విజయం సాధించారు.