ఏపీలో ప్రతి అంశంపై రాజకీయం చేయడం అధికార, ప్రతిపక్షాలకు బాగా అలవాటైపోయినట్లుంది. గత రెండేళ్లుగా ఏదొక విషయంలో వైసీపీ, టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో కూడా రెండు పార్టీలు బాగానే రాజకీయం చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో పిల్లల ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని టీడీపీ నేత లోకేష్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.