జగన్ అధికారంలోకి రాగానే ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం 25 మంది జగన్ కేబినెట్లో ఉన్నారు. అయితే మొదట్లో అవకాశం దక్కనివారికి రెండోవిడతలో చేసే మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తానని చెప్పారు. రెండున్నర ఏళ్లలో పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని అన్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది. అంటే మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయి.