ఏపీలో బలపడటానికి పవన్ కల్యాణ్ ఏమన్నా కష్టపడుతున్నారా? రాష్ట్రంలో జనసేనకు 175 నియోజకవర్గాల్లో నాయకులు ఉన్నారా? అసలు పవన్ నెక్స్ట్ ఏ సీటులో పోటీ చేస్తారు? అనే ప్రశ్నలకు జనసేన కార్యకర్తల నుంచే పెద్దగా సమాధానం రాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఏపీలో జనసేన బలం పుంజుకోలేదు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా పవన్, టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బిఎస్పిలతో పొత్తు పెట్టుకుని చిత్తుగా ఓడిపోయారు.