మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఇప్పటి వరకూ ఓ కొలిక్కి రాకపోవడం విశేషం. సీబీఐ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించినా కూడా నత్తనడకన సాగుతోందనే ఆరోపణలున్నాయి. వివేకా కుమార్తె కూడా ఈ కేసు విచారణ సవ్యంగా సాగడంలేదని ఆరోపించిన క్రమంలో సీబీఐ మరోసారి దూకుడు ప్రదర్శిస్తోంది. ఏపీలో విచారణ పర్వం మరోసారి మొదలు పెట్టింది. అంతా బాగానే ఉన్నా ఆరోపణలు వచ్చిన పెద్దలవైపు మాత్రం సీబీఐ చూడకపోవడం విశేషం.