ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని విభాగాల్లోనూ తన మార్కు చూపించారు. సచివాలయాలతో పాలన సులభతరం చేశారు. ఆర్థిక లబ్ధిని నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమచేస్తూ పాలనలో పారదర్శకత తీసుకొచ్చారు. అయితే ఇసుక పాలసీలో మాత్రం ఆయన చేసిన ప్రయోగాలు ఫలించలేదు. వాస్తవం చెప్పాలంటే ఆ ప్రయోగాల వల్లే ఇప్పుడు నిర్మాణవ్యయాలు తడిసి మోపెడయ్యాయి. కరోనా కష్టకాలంలో ఇసుక కష్టాలు మరింత పెరిగాయంటే.. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడమేనని చెప్పాలి.