ఇప్పుడు చైనా ఓ మహా ప్రయత్నం చేస్తోంది. అదే.. కృత్రిమ సూర్యుడిని ఏర్పాటు చేయడం. భూమిపై సూర్యుడా.. అదెలా అంటారా.. సూర్యుడిలో వేడి పుట్టేందుకు ఏం ప్రక్రియలు జరుగుతున్నాయో.. అవే ఇప్పుడు ఇక్కడ భూమిపైనా జరిగేలా చేసి మరో సూర్యుడిని భూమి మీదే ఏర్పాటు చేయాలని చైనా ఓ భారీ ప్రాజెక్టును తలపెట్టింది.