సాధారణంగా సంగీతదర్శకులకు ఒక ఫుల్ లెంత్ మ్యూజికల్ ఫిల్మ్ తీయాలని బాగా కోరిక గా ఉంటుంది. ఈ మ్యూజికల్ ఫిల్మ్స్    ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరో ఒక గిటారిస్ట్. హీరోయిన్ కోమలి శంకరాభరణం (అమలాపాల్) సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. వయోలిన్ కూడా నేర్చుకోవాలని ఈమె బ్రహ్మానందం వద్ద విద్యార్థినిగా చేరుతుంది. ప్రధాన పాత్రలన్నీ కూడా సంగీత రంగం లోనే మునిగి తేలుతుంటే దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించి.. మ్యూజిక్ పరంగా సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంలోని రన్ రన్ పాటను ప్రముఖ బ్రిటిష్ సింగర్ అపాచే ఇండియన్ చేత పాడించారు.