జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగింది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను సైతం నెరవేర్చారు సీఎం జగన్. అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా జగన్ పథకాలు ప్రవేశపెట్టారు అన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే అటు డ్రైవర్ల అందరికీ కూడా ఎంతో ప్రయోజనం చేకూరాలి అనే ఉద్దేశంతో.. ఎక్కడ ఆర్థిక ఇబ్బందులతో బాధపడకూడదు అని భావించి ఇక ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు వాహనమిత్ర అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం.