గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు జగన్కు షాక్ ఇచ్చి, చంద్రబాబుకు జై కొట్టిన విషయం తెలిసిందే. అయితే అధికారం కోసం ఆశపడి ఆ నాయకులు వైసీపీలో గెలిచి, టీడీపీలో చేరారు. అలా అప్పుడు టీడీపీలో చేరిన నాయకులు పరిస్తితి 2019 ఎన్నికల్లో ఏమైందో అందరికీ తెలిసిందే. ఒక్క గొట్టిపాటి రవికుమార్ తప్ప టీడీపీ తరుపున పోటీ చేసిన జంపింగ్ ఎమ్మెల్యేలంతా ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయాక ఆ నాయకులు పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది.