గత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయాక, ఆ పార్టీకి చెందిన నేతలు వరుసపెట్టి అధికార వైసీపీలోకి జంప్ కొట్టేసిన విషయం తెలిసిందే. అధికారం దక్కుతుందనే ఉద్దేశంతో టీడీపీలోని సీనియర్ నేతలు సైతం, తమ వారసులని వెంటబెట్టుకుని మరీ జగన్ చెంత చేరారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న సీనియర్ నేతలు కరణం బలరాం, శిద్ధా రాఘవరావులు సైతం వైసీపీ వైపుకు వెళ్లారు.